తూర్పుగోదావరి జిల్లా అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంత ప్రశస్త్యం ఉందో..ప్రసాదానికి అంతే ప్రాధాన్యం ఉంది. స్వామి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత ప్రసాదం తప్పనిసరిగా స్వీకరిస్తేనే పూజ పూర్తవుతుందని శాస్త్రం చెబుతోంది. గోధుమ రవ్వతో తయారుచేసే స్వామి ప్రసాదాన్ని భక్తులు ఎంతో ఇష్టంతో ఆరగిస్తారు. గోధుమ రవ్వలో పంచదార నెయ్యి, సుగంధ ద్రవ్యాలు వేసి తయారు చేస్తారు. ఇదంతా చాలా సమయంతో కూడుకున్నది. కార్తీక మాసంలో భక్తుల డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రసాదం అందించేందుకు.... దేవస్థానం సిబ్బంది చెమటోడాల్సి వచ్చేది. వీటన్నిటిని అధిగమిస్తూ పెద్దాపురం గ్రామానికి చెందిన మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.5కోట్ల వ్యయంతో..ఆధునిక హంగులతో ప్రసాదం తయారీకి భవనం నిర్మించారు.
Annavaram Temple: సత్యదేవుని సన్నిధిలో మరిన్ని సౌకర్యాలు - Annavaram Temple updates
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దాతల సహకారంలో రెండు కళ్యాణ మండపాలను నిర్మించారు. స్వామివారి ప్రసాదం తయారీ కోసం ఆధునిక హంగులతో వంటశాలను అందుబాటులోకి తెచ్చారు.
వివాహాల కోసం రెండు ఉచిత కళ్యాణ కళ్యాణ మండపాలు నిర్మించారు. పెద్దాపురం గ్రామానికి చెందిన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో కళ్యాణ మండపాన్ని ఆకర్షణీయంగా నిర్మించారు. విశాఖపట్నానికి చెందిన మరో దాత, దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు మారెడ్డి సింగారెడ్డి, అంజని దంపతులు మరో కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తెచ్చారు. సత్యదేవుని సన్నిధిలో దాతల సాయంతో మెరుగైన వసతులు సమకూరడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి