ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో కరోనా మరణ మృదంగం.. రెండు రోజుల్లో నలుగురు మృతి - corona deaths in amalapauram latest update

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. వరుసగా రెండు రోజుల్లో నలుగురు కరోనాతో మృతి చెందడం వైరస్​ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డివిజన్ అడిషనల్ డీఎమ్​హెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కరరావు సూచించారు.

more corona deaths in amalapuram
కోనసీమలో కరోనాతో రెండు రోజుల్లో నలుగురు మృతి

By

Published : Jul 21, 2020, 8:23 PM IST


పచ్చని కోనసీమలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అమలాపురం కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో వరుసగా రెండు రోజుల్లో మొత్తం నలుగురు ప్రాణాలు విడిచారు. కరోనా కారణంగా ఈనెల 20న ఇద్దరు చనిపోగా.. ఈరోజు రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన వ్యక్తి, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందడం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది. కోనసీమ వ్యాప్తంగా ఇంతవరకూ కొవిడ్ బారినపడి 12 మంది చనిపోయారని అమలాపురం డివిజన్ అడిషనల్ డీఎమ్​హెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కరరావు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి...

న్యాయవాది కేసు: అఫిడవిడ్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details