తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికిలో మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జాతీయ రహదారిపై హోటల్లో రెండు రోజుల క్రితం ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ రాగా వారితో కాంటాక్ట్ అయినవారికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో అదే హోటల్లో పని చేసే ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామంలో గతంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి బంధువుకు వైరస్ సోకినట్లు పీహెచ్సీ వైద్యాధికారి సుదర్శన బాబు నిర్దరించారు.
మడికిలో మరో నాలుగు కోవిడ్ పాజిటివ్ కేసులు - తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు వివరాలు
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలంలో మొత్తం కేసుల సంఖ్య 33కు చేరింది.
![మడికిలో మరో నాలుగు కోవిడ్ పాజిటివ్ కేసులు more corona cases recorded](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7880364-482-7880364-1593790996166.jpg)
మడికిలో మరో నాలగు కోవిడ్ పాజిటివ్ కేసులు
ఇవీ చూడండి... :'అర్హతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాల అమలు'