తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో.. జనావాసాల మధ్య తిరుగుతున్న వానరాలను... పురపాలకశాఖ సిబ్బంది పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కోతుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు... మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు చొరవ తీసుకుని... ప్రత్యేక బోను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కోతులను బంధించి అటవీ ప్రాంతానికి తరలిస్తున్నారు.
కోతులను పట్టి.. అడవిలో వదులుతున్న మున్సిపల్ సిబ్బంది - తుని తాజా సమాచారం
తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలపై కోతుల దాడులు పెరుగుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది వాటిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలిస్తున్నారు.
కోతుల పట్టివేత