Monkey Viral Video:తూర్పుగోదావరి జిల్లా నిడసలమెట్ట గ్రామానికి చెందిన సత్యనారాయణ వైద్యం నిమిత్తం అనపర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్‌లో ఉన్న తన బైక్ దగ్గరకు చేరుకున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు కానీ..ఓ వానరం అతడి బైక్ ఎక్కి కూర్చుంది. సత్యనారాయణ దానిని కిందకు దింపేందుకు ఎంత ప్రయత్నించా.. దిగకుండా బైక్‌పైనే కూర్చింది.
అది తన బైక్ దిగి వెళ్లక పోతుందా..! అని చాలా సేపు ఎదురు చూశాడు. అయినా.. కోతి బైక్‌పై నుంచి కదలకపోవటంతో ఇక చేసేదేం లేక..తనతో పాటే కోతిని ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకొని ఇంటికి బయల్దేరాడు. రహదారిపై వెళ్తుండగా.. ఇది గమనించిన పలువురు కోతిని వింతగా చూశారు.