ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ - తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ వార్తలు

కనుమరోజు కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థం కార్యక్రమంపై ప్రధాని మోదీ స్పందించారు. యువజన సభ్యులకు ఈ-మెయిల్​ ద్వారా లేఖ పంపారు.

modi letter to east godavari youth members
modi letter to east godavari youth members

By

Published : Jan 15, 2020, 5:33 AM IST

Updated : Jan 15, 2020, 11:34 AM IST

తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ

సంక్రాంతి సందర్భంగా కనుమరోజు కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థానికి విశేష ప్రాధాన్యత ఉంది. తూర్పుగోదావరి జిల్లా మెుసలపల్లి పంచాయతీ పరిధి జగ్గన్నతోటలో.. ఏకాదశ రుద్రప్రభలతో కొలువుదీరే ప్రభలతీర్థం విశేషాలను వివరిస్తూ శివకేశల యూత్‌ సభ్యులు.. ప్రధాని మోదీకి పంపిన సమాచారంపై ఆయన స్పందించారు. యువజన సభ్యులకు... ఈ-మెయిల్‌ ద్వారా లేఖ పంపారు.

కనుమ రోజు నిర్వహించే ప్రభలతీర్థానికి... 17వ శతాబ్ధం నుంచి ప్రాధాన్యత సంతరించుకుందంటూ పేర్కొన్నారు.

జగ్గన్నతోటలో ప్రభల తీర్థం నాడు కొలువుదీరే ఏకాదశ రుధ్రుల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ప్రధాని నుంచి లేఖ రావడం పట్ల యువజన సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : చర్చలకు వాళ్లు పనికి రారా..?: కళా వెంకట్రావు

Last Updated : Jan 15, 2020, 11:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details