ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీల్లో కోనసీమ కుర్రాడు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

అందరికి కంటే భిన్నంగా ఉండాలనుకోవటం తేలికే. ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకు రావడమే అతిపెద్ద సవాలు. అందులోనూ రంగుల ప్రపంచమైన ఫ్యాషన్ రంగంలో రాణించటం తేలికైన విషయం కాదు. మోడలింగ్ రంగంపై కనీస అవగాహన లేని ప్రాంతం నుంచి వచ్చిన ఆ యువకుడు పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగాడు. సమస్యలు, అవరోధాలు ఎదురైనా.. అనుకున్నది సాధించాడు అమలాపురానికి చెందిన సాయి నాగేంద్ర. మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలకు రాష్ట్రం తరపున ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు.

model medida sai nagendra
model medida sai nagendra

By

Published : Dec 11, 2020, 6:23 PM IST

మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీల్లో కోనసీమ కుర్రాడు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మేడిద సాయి నాగేంద్ర మోడల్​గా సత్తా చాటుతున్నాడు. చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరికతో ... అవకాశం దొరికినప్పుడల్లా పాఠశాల, కళాశాలల్లో డ్యాన్స్, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేవాడు. సినిమా నటుడు కావాలంటే అంత తేలికేం కాదని గ్రహించిన నాగేంద్ర... ముందుగా ఫ్యాషన్ షోలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పలుసార్లు ముంబై వెళ్లి మెళకువలు నేర్చుకున్నాడు.

మిస్టర్ ఇండియా బరిలో..

ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్​లో జరిగిన దక్షిణ భారత టాప్ మోడల్ పోటీల్లో విజేతగా నిలిచాడు నాగేంద్ర. ఆ తర్వాత నటన వైపు తన ప్రస్థానం కొనసాగించేందుకు అన్నపూర్ణ సినీ స్టూడియోలో చేరి శిక్షణ పొందుతున్నాడు. తాజాగా మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్- 2020 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ కోనసీమ కుర్రోడినే ఎంపిక చేశారు. ఈ నెల 12న గోవాలో జరిగే ఈ పోటీల్లో నెగ్గేందుకు కసరత్తు చేస్తున్నాడు నాగేంద్ర.

ఇంజనీరింగ్ చదువుతూనే..

అందరి కుర్రాళ్లలా కాకుండా తమ బిడ్డ మోడల్, నటన వైపు ఆసక్తిగా ఉండటంతో మొదట నాగేంద్ర తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారం చూసుకోవాలని తండ్రి రమేష్ చెప్పారు. కానీ నాగేంద్ర పోటీలో నెగ్గడం...అంతా అభినందించటంతో వారు కూడా కాదనలేకపోయారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూనే తనకిష్టమైన రంగం వైపు అడుగులు వేస్తున్నాడు ఈ కోనసీమ యువకుడు.

ఇదీ చదవండి

భూముల రీసర్వే కోసం కేంద్ర ప్రభుత్వ సాయం..!

ABOUT THE AUTHOR

...view details