ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై అవగాహన - ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి ఎన్నికల పరిశీలకులు జేఎస్వీ ప్రసాద్ అవగాహన కల్పించారు.
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పై అవగాహన
By
Published : Mar 15, 2019, 4:38 PM IST
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పై అవగాహన
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకులు జేఎస్వీ ప్రసాద్ సిబ్బందికి సూచించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరానికి ఆయన హాజరయ్యారు. కలెక్టర్ కార్తికేయమిశ్రాతో కలిసి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు.