ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది - mlc venkateswara rao updates

ప్రజల తరఫున పోరాడుతున్న తమపై.. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ ఐఐ.వెంకటేశ్వరరావు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ వద్ద ఏర్పాటుచేసిన యూటీఎఫ్ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

mlc venkateswara rao
ఎమ్మెల్సీ ఐఐ.వెంకటేశ్వరరావు

By

Published : Jan 6, 2021, 8:24 AM IST

ప్రజా వ్యతిరేక చర్యలపై తాము పోరాడుతుంటే ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐఐ.వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ వద్ద ఏర్పాటుచేసిన యూటీఎఫ్ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details