ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రారంభం అని చెప్పారు.. అంతలోనే వద్దన్నారు.. ఎందుకు?

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రేషన్ సరుకుల వాహనాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగింది.

MLA who returned without distributing ration goods vehicles in Ravulapalem, East Godavari district
ప్రారంభమన్నారు... అంతలోనే వద్దన్నారు...

By

Published : Jan 22, 2021, 7:06 AM IST

రేషన్ సరుకులను ఇంటింటికీ అందించేందుకు ప్రభుత్వం వాహనాలను సిద్ధం చేసింది. వీటిని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో వాహనాల ప్రారంభోత్సవానికి హాజరైన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వెనుదిరిగారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలకు మంజూరైన వాహనాలను.. కాకినాడ నుంచి రావులపాలేనికి ఉన్నతాధికారులు పంపించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 మండలాలకు చెందిన వాహనాలను కొత్తపేట ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. వాహనాలను పరిశీలించి, లబ్ధిదారులతో పరిచయం చేసుకుని.. ప్రారంభించకుండా.. వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details