తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పర్యటించారు. పర్యటనలో భాగంగా...గోకవరం గ్రామంలోని మహిళలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను తెలుపుకున్నారు. గిరిజనులుకు కుల ధృవీరకణ పత్రాలను ఇవ్వకుండా...అధికారులు పలుమార్లు తిప్పుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక పాఠశాలలో తరగతి గదులు, గ్రామంలో తాగునీటి సమస్య, వైద్య సౌకర్యాల సమస్యల గురించి మహిళలు చెప్పగా...త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు.
గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన - east godavari, prathipadu
తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పర్యటించారు. గిరిజన మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా...త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే