తూర్పు గోదావరి జిల్లాలో వై.కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్ చేయూత పథకం కింద ఓ మహిళ ఏర్పాటు చేసుకున్న కిరాణా దుకాణాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు.
ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చిరు వ్యాపారాలు మొదలు పెట్టి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. అనంతరం గ్రామాల్లో సచివాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.