ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారదర్శకంగా ఇళ్ల స్థలాల కేటాయింపు: ఎమ్మెల్యే - పోతవరం వార్తలు

అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఆన్​లైన్ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లా పోతవరంలో ఆయన ప్రారంభించారు.

MLA Kondetti Chittibabu
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

By

Published : Sep 11, 2020, 11:56 AM IST

ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ ప్రక్రియ వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఆన్​లైన్ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఎమ్మెల్యే పోతవరంలో ప్రారంభించారు. నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని ఎమ్మెల్యేె వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details