ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాండ్ కొట్టి సందడి చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు - తీన్మార్ డప్పు కళాకారులతో శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు కళాకారులతో కలిసి సరదాగా కాసేపు బ్యాండ్ కొట్టారు. నియోజకవర్గంలోని ఊడిముడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బ్యాండ్ వాయిస్తూ తనదైన శైలిలో కళాకారుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

mla chittibabu
బ్యాండ్ కొట్టిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

By

Published : Jul 3, 2021, 9:59 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు బ్యాండ్ కొడుతూ సందడి చేశారు. తీన్మార్ డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయించారు. నియోజకవర్గంలోని ఊడిముడి గ్రామంలో రూ.20 లక్షలు నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యాండ్ వాయిద్యకారులతో కలిసి ఎమ్మెల్యే బ్యాండ్ కొట్టి సందడి చేశారు. మొదటగా గ్రామానికి చేరుకున్న ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బ్యాండ్ కొట్టి సందడి చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details