తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అంబాజీపేట మండలానికి చెందిన పుచ్చకాయల చంద్రశేఖర్, కోట మోషే ఇద్దరు ద్విచక్రవాహనంపై పి.గన్నవరం వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం వారిని ఢీకొట్టింది.
ఎమ్మెల్యే సాయం..రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలింపు
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే కొండేటి సాయం
అమలాపురం కిమ్స్‌కి..
ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్థానిక సామాజిక ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జీ సురేంద్ర వెల్లడించారు.
ఇవీ చూడండి : శ్రీసిటీ.. ఇచ్చట అంతర్జాతీయ స్థాయి దుస్తులు తయారవును..!