ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మహత్యాయత్నం చేసిన వాలంటీర్​కు ఎమ్మెల్యే పరామర్శ - east godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనను అందరిలో దూషించారంటూ ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎమ్మెల్యే చిట్టిబాబు స్వయంగా పరామర్శించారు.

MLA kondeti chittibabu
MLA kondeti chittibabu

By

Published : Nov 9, 2020, 8:10 PM IST

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మందలింపుతో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన వాలంటీర్‌ పి.సువర్ణ జ్యోతి మనస్థాపానికి గురై.. సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఆమెను ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే చిట్టిబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి వారితో మాట్లాడుతూ... ఆమెను తాను దూషించలేదని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details