తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. వైద్యుడు, రేడియో గ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీతో పాటు వివిధ సమస్యలను పరిష్కారిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఆసుపత్రిని 50పడకలుగా మార్చేందుకు రూ.3కోట్ల నిధులతో విస్తరణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అత్యవసర కేసులను వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసే సమయంలో కొందరు తమపై ఒత్తిడి పెంచుతున్నారని సిబ్బంది.... ఎమ్మల్యే దృష్టికి తీసుకెళ్లారు.