ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టాలని.. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు నిధులు ఉన్నా..పనులు వేగంగా జరగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ భవనాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించి.. సంబంధిత శాఖలకు అప్పగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వచ్చే మార్చి నెలకు అన్ని భవనాల నిర్మాణాలు పూర్తి కావాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
'వచ్చే మార్చికి నిర్మాణాలు పూర్తి కావాలి'
పలు శాఖల అధికారులతో తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు... స్థల సేరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యే చిట్టిబాబు సమీక్ష సమావేశం