తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేశారు. ముంగండ, అంబాజీపేట, అయినవిల్లి గ్రామాల్లో రూ. 4కోట్ల రూపాయలతో చేపట్టిన పాఠశాలల తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 19 మందికి రూ.4 లక్షల రూపాయల చెక్కులను అందించారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
వైకాపా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. నియోజకవర్గంలో రూ. 4 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిట్టిబాబు