తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రెండు చోట్ల పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు అనుకూలంగా లేవని విమర్శలు వస్తున్నాయి. పి.గన్నవరం మండలం నాగుల్ లంకలో 7 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఎకరా రూ.40 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. ఈ భూమిని మెరక చేసే పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నాగుల్ లంక వెళ్లారు. భూమి చూసిన ఆయన రెవెన్యూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వరద ప్రభావం ఉండే ప్రాంతంలో భూములు ఎలా సేకరించారని మండిపడ్డారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఆ భూమి అనుకూలం కాదని పనులు ప్రారంభించకుండా ఆయన వెనక్కి వెళ్లిపోయారు.
ఈ భూముల్లో ఇళ్లు ఎలా కట్టుకుంటారు..? - house land distribution latest news in east godavari
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రెండు చోట్ల పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు... పంపిణీకి అనుకూలం కాదని స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. ఇల్లు కట్టుకోవడానికి ఏమాత్రం అనుకూలం కాని భూములను ఎలా సేకరించారని అధికారులను ఆయన ప్రశ్నించారు.
ఇళ్ల స్థలాల భూసేకరణ పై ఎమ్మెల్యే అసంతృప్తి
అయినవిల్లి మండలం పొట్టిలంకలో గోదావరి మధ్యలో నదీ కోతకు ఆనుకుని మూడు ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఇది కూడా రూ.40 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. నది కోత ఉన్నచోట భూమిని ఎందుకు సేకరించారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాల్లో భూములు ఇళ్ల స్థలాలకు అనుకూలం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చిట్టిబాబు తెలిపారు.