తనకు కరోనా సోకలేదని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు.తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిందంటూ.. కొన్ని చానళ్లు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న కుటుంబ సభ్యులు, గన్‌మెన్, కారు డ్రైవర్‌తో సహా అందరమూ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నామని.. అందరికీ నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు.
వైరస్‌తో బాధపడుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. అధికారులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తనను కలిసిన వారెవరూ ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదని వివరించారు.