సీఎం జగన్ పేదలకు సొంత ఇంటిని అందించి.. వారి కలను నేరవేర్చారని గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండల పరిధిలోగల కృష్ణవరం, రాజుపాలెం, రామకృష్ణాపురం, గెద్దనాపల్లి గ్రామాలకు చెందిన 687మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. నియోజకవర్గంలో ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యనారాయణ రాజు, ఎంపీడీవో లలిత, వైకాపా నాయకులు పాల్గొన్నారు.