వైకాపా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తుందని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరినీ వైఎస్ జగన్ ఆదుకుంటారని అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం హయాంలో 250 కోట్లు 50వేల మందికి రుణాలిచ్చారని... తమ ప్రభుత్వం కాపునేస్తంలో 3లక్షల 20వేల మందికి సాయం అందించామని అన్నారు.
'వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది' - జక్కంపూజి రాజాపై వార్తలు
వరదల కారణంగా నష్టపోయిన రైతులను వైకాపా ప్రభుత్వం ఆదుకుంటుందని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు.

ఎమ్మెల్యే జక్కంపూడి