కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తతో వ్యవహరిస్తూ.. అవసరమైతేనే బయటకు రావాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కేడ్మిల్లి గ్రామాల్లో కరోనా నివారణ దృష్ట్యా హైపో క్లోరైడ్ రసాయాన్ని పిచికారీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్వయంగా ఆయనే గ్రామాల్లో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రజలంతా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
ఇవీ చదవండి: