తుఫాను ప్రభావిత ప్రాంత వాసులకు అన్ని సౌకర్యాలూ అందించాల్సిందిగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమాలను రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లుగా అభివర్ణించారు. వాటి ఫలాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వర్షాల ధాటికి నీరు నిలిస్తే.. వెంటనే తోడించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి - రావులపాలెంలో ఎమ్మెల్యే సమీక్ష
భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను కొత్తపేట ఎమ్మెల్యే ఆదేశించారు. పంట బోదెలపైనున్న అక్రమ కట్టడాలను తొలగించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సమీక్ష
పంట బోదెలపై అక్రమ కట్టడాల వల్ల నీరు ప్రవహించక.. పొలాలు మునిగిపోతున్నాయని రైతులు విన్నవించుకున్నారు. వాటిని తొలగించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, సంరక్షణ కేంద్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:భారీ వర్షానికి నీటమునిగిన జీసీసీ గోదాములు- తడిచిన నిత్యావసరాలు