తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని కొత్తపేట నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన 108, 104 వాహనాలను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 108, 104 వాహనాలను ప్రారంభించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ రికార్డు సృష్టించారని జగ్గిరెడ్డి అన్నారు. ప్రజలకు సత్వర వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో వీటిని ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వైద్యరంగాన్ని పూర్తిగా విస్మరించిందని, వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో వినూత్న మార్పులు తెచ్చిందన్నారు.
కొత్తపేటలో 108, 104 వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి - కొత్తపేటలో 108,104 వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని కొత్తపేట నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన 108, 104 వాహనాలను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.
కొత్తపేటలో 108,104 వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
108 నంబరుకు ఫోను చేయగానే పట్టణ ప్రాంతాలకు 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాలకు 20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాలకు 25 నిమిషాల్లో వాహనం చేరుకుంటుందని వివరించారు.
ఇవీ చదవండి: లక్కీ స్కీం పేరుతో ఘరానా మోసం