తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ముంపునకు గురైన పంటపొలాలను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వద్దిపర్రు, ఉచ్చిలి గ్రామాల్లోని పంటపొలాలలో వర్షపునీరు బయటకి పోయే మార్గం లేకపోవడంతో పంటలు పాడైపోతున్నాయని ఎమ్మెల్యేకు వారు తెలిపారు. ఆయన ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి .. రోడ్డుకు గండి కొట్టించారు. అనంతరం వరదనీరును కాలువలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట్ల గండి కొట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
'నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది' - ఆత్రేయపురం మండలంలో భారీ వర్షం
వర్షాలు వల్ల నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

ఆత్రేయపురం మండలంలోని ముంపు ప్రాంతం