రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అరాచకవాదిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని... రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను... తొలిసారి శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. 38 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి శాసన సభను చూడలేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాట పరిగణలోకి తీసుకోకుండా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. వాకౌట్ చేస్తామని చెప్పేందుకూ మైక్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన సభలో నవరత్నాలు జగన్ వివరించడంపై గోరంట్ల ఎద్దేవా చేశారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినవేనని... పేర్లు మార్చి అమలు చేయడానికి చూస్తున్నారనీ ఆరోపించారు.
రాష్ట్రంలో అరాచక పాలన: గోరంట్ల బుచ్చయ్య - undefined
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యవహరశైలి అరాచకంగా ఉందన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి