తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు.వినాయకుడి విగ్రహం అపవిత్రం ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారంటూ సందీప్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్ - ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్టు వార్తలు
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వినాయకుడి విగ్రహం అపవిత్రం ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారన్న ఆభియోగాలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
arrest
గతేడాది సెప్టెంబర్ నెలలో రాజమహేంద్రవరం గ్రామీణం పిడింగొయ్యి పరిధిలోని వెంకటగిరిలో వినాయకుడి విగ్రహానికి దుండగులు మలినం పూశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన పోలీసులు... వినాయక విగ్రహం అపవిత్రంపై ఆధారాలు లేవని తేల్చారు. అయితే ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి ఉద్రిక్తతలు ప్రేరేపించారనే ఆరోపణలతో సందీప్‌ను ఈ కేసులో ఏ2గా చేర్చి ఇవాళ అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:తెదేపా నేత కళా వెంకట్రావు అరెస్టు