తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతిని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. నగరంలోని మురుగునీరు నదిలోకి వెళ్లే నల్లా ఛానల్ను ఆయన సందర్శించారు. నగరంలోని మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద పంప్ హౌస్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. లంక గ్రామాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ సీజన్ లోఇప్పటివరకు ఆనకట్ట నుంచి 11 వందల టీఎంసీల నీరు వృథాగా పోయిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ నీరంతా వృథా కాకుండా, రైతులకు ఉపయోగ పడేదని గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టులు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేసి వరద నీటిని నిల్వ చేయాలని ఆయన సూచించారు.
పోలవరం పూర్తయితే..నీటి వృథా మాటే రాదు! - ధవలేశ్వరం ఆనకట్ట
పోలవరం పూర్తయితే 11వందల టీఎంసీల నీరు వృథా అయ్యిండేది కాదంటున్స్తారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
mla gorantla buchaiah choudarai visit to the davaleswaram reservior at east godavari district
Last Updated : Aug 10, 2019, 1:30 PM IST