అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ది పొందే గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. పి గన్నవరంలో బియ్యం సరఫరా చేసిన ఆయన.. చిన్నారులకు కూడా ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పి.గన్నవరంలోని అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని ఎమ్మెల్యే చిట్టిబాబు సరఫరా చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపణీ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు