మాజీఎంపీ జీవీ.హర్షకుమార్‌ను పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఎంపీ దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానకరంగా మాట్లాడటం సహేతుకం కాదన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా వాలంటీర్‌కు ప్రభుత్వపరంగా నివాస స్థలం మంజూరు చేశామని ఆయన వివరించారు. 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించిన హర్షకుమార్.. ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీఎంపీ హర్షకుమార్‌పై ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆగ్రహం - razole latest news
తమపై దూషణలు మానుకోవాలని అమలాపురం మాజీఎంపీ జీవీ.హర్షకుమార్‌ను పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు హెచ్చరించారు. అవమానకర వ్యాఖ్యలు చేయటం సరికాదని హితవు పలికారు.
![మాజీఎంపీ హర్షకుమార్‌పై ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆగ్రహం mla fired on former MP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9520435-803-9520435-1605167305230.jpg)
మీడియా ముందు మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు