సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర వహిస్తున్నారని.. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో 11 మండలాలకు చెందిన వాలంటీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య, ఏఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా.. వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు అందించారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
వాలంటీర్లను సన్మానించిన రంపచోడవరం ఎమ్మెల్యే - rampachodavaram mla dhana lakshmi
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వాలంటీర్లకు సన్మానం జరిగింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో వారి పాత్ర కీలకమని ఎమ్మెల్యే ధనలక్ష్మి కొనియాడారు.

ఎమ్మెల్యే ధనలక్ష్మి, రంపచోడవరంలో వాలంటీర్లకు సత్కారం