తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రాష్ట్ర బాగోగులు కన్నా.. ఆ 30 గ్రామాల రియల్ ఎస్టేట్ గురించే ఎందుకు పోరాటం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నిస్తున్నారు. జగన్ అందించే సంక్షేమ పథకాలకు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. అమరావతి తప్ప.. రాష్ట్రం గురించి చంద్రబాబుకు ఏ మాత్రం తాపత్రయం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
'వైకాపా సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు' - ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా వార్తలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆ 30 గ్రామాల మీదే తాపత్రయం ఎందుకని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. వైకాపా సంక్షేమ పథకాలతో గుంటూరు జిల్లా ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు.
mla dhadisetti