ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల స్థలాలు పంపిణీ ఘనత వైకాపాకే దక్కుతుంది' - తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. మండలంలోని పెదపూడి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

house sites distribution at p gannavaram
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు

By

Published : Dec 31, 2020, 5:31 PM IST

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. మండలంలోని పెదపూడి గ్రామంలో నాలుగు గ్రామాలకు చెందిన 406 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ ఇళ్ల స్థలాల కాలనీలకు జగనన్న కాలనీగా నామకరణం చేశారు.

ABOUT THE AUTHOR

...view details