సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌కు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్పష్టం చేశారు. కొన్ని ఛానళ్లు, పత్రికల వాళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పథకం ప్రకారమే తనపై అబద్ధపు వార్తలు ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేస్తున్నానని వివరించారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.