ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మీ సమస్యల పరిష్కారానికి.. మీ గుమ్మంలోకే" - mla chirla jaggireddy starts new program

"మీ సమస్యల పరిష్కారానికి మీ గుమ్మంలోకే" అనే కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందుతున్నాయా? లేదా? అని తెలుసుకున్నారు.

mla chirla jaggireddy starts new program
"మీ సమస్యల పరిష్కారానికి మీ గుమ్మంలోకే" ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

By

Published : Jan 6, 2021, 8:33 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో "మీ సమస్యల పరిష్కారానికి మీ గుమ్మంలోకే " అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఇంటింటికీ సంబంధిత వాలంటీర్లను తీసుకుని వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు సరిగ్గా అందుతున్నయా? లేదా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం నుంచి ఇంకా ఏమి సహాయం కావాలని అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందని వారు ఎవరూ ఉండకూడదని చెప్పారు. అలా ఎవరైనా సంక్షేమ పథకాల ఫలాలకు దూరం అవుతుంటే అధికారులు వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details