తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కోడిపందేలను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన కోడిపందేల బరి వద్దకు ఎమ్మెల్యే చేరుకొని స్థానిక నాయకులతో కలిసి కోడిని పట్టుకొని బరిలోకి దింపారు. కోడిపందేలు, గుండాటలు నిర్వహించకూడదని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఈ హెచ్చరికలు ఎక్కడా అమలు కాలేదు. ఏటా మాదిరిగానే ఇప్పుడు కూడా కోడిపందేలు, గుండాటలు సాగుతున్నాయి.
కొత్తపేటలో కోడి పందేలు ప్రారంభం... పట్టించుకోని అధికారులు - తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు తాజా వార్తలు
కోడిపందేలు గుండాటలు వంటివి నిర్వహించకూడదని ఇరవై రోజుల ముందు నుంచి పోలీసులు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ యధావిధిగా కోడిపందేలు నిర్వహిస్తునే ఉన్నారు. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ కోడి పందేలను ప్రారంభించడం గమనార్హం.
కొత్తపేటలో కోళ్ల పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమలో పి.గన్నవరం, అమలాపురం, అల్లవరం, కొత్తపేట, రాజోలు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అంబాజీపేట తదితర మండలాల్లో పలు గ్రామాల్లో ఈరోజు ఉదయం నుంచి కోడి పందేలు గుండాటలు కొనసాగుతున్నాయి. పోలీసులు సైతం అటువైపు వెళ్లకపోవడం శోచనీయం. సంక్రాంతి మూడు రోజుల పాటు వీటిని నిర్వహించే విధంగా నిర్వాహకులు బరులను ఏర్పాటు చేసుకున్నారు.
ఇవీ చూడండి...:కొత్తపేటలో భోగి సందడి