ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దు : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి - అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దు : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

mla
స్ప్రే చేస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

By

Published : May 16, 2021, 11:23 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో హైపో క్లోరైడ్ ద్రావణ పిచికారి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. స్వయంగా ఆయనే వీధుల్లో స్ప్రే చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో శానిటైజేషన్​ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని సూచించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:కరోనా భయం.. తీసింది యువకుడి ప్రాణం

ABOUT THE AUTHOR

...view details