ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు అదనపు నీటిని విడుదల చేయటంతో.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, జి రాగంపేట, వడ్లమూరులో పంటలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో మునిగిన పంటలను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లను సైతం ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే చినరాజప్ప - chinarajappa in peddapuram
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పలు చోట్ల మునిగిన పంటలను పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఎమ్మెల్యే తెలిపారు.
నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే చినరాజప్ప