ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలిన వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే చినరాజప్ప - mla chinarajappa latest news

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వద్ద ఏలేరు కాల్వపై కూలిన వంతెనను స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు.

mla chinarajappa
కూలిన వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప

By

Published : Nov 15, 2020, 9:44 AM IST

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట - పిఠాపురం మధ్య ఉన్న వంతెన కూలిపోయింది. కూలిన ఆ వంతెనను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి తెదేపా హయాంలోనే నిధులు మంజూరు చేశామని తెలిపారు. శిథిలమైన వంతెనను గత నెలలో పరిశీలించి రాకపోకలు నిలిపి వేయాలని అధికారులకు సూచించామన్నారు. హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదని స్థానికులు చెప్పారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మార్గం కాబట్టి తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలని చినరాజప్ప అన్నారు. నూతన బ్రిడ్జి పనులు కూడా జరుగుతున్నాయని.. నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details