ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డంప్ యార్డ్​తో ప్రజలకు ఇబ్బందులు.. పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాలు - రాజమహేంద్రవరం తాజా వార్తలు

రాజమహేంద్రవరం 41వ డివిజన్​లో డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నగరపాలక సంస్థ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు డంపింగ్ యార్డును ఎమ్మెల్యే పరిశీలించారు.

వినతిపత్రాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే
వినతిపత్రాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే

By

Published : Nov 17, 2020, 7:21 PM IST

రాజమహేంద్రవరం 41వ డివిజన్​లో డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నగరపాలక సంస్థ అధికారుల్ని ఆదేశించారు. లూథరగిరి చర్చి సమీపంలోని డంపింగ్ యార్డు వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఈ మేరకు డంపింగ్ యార్డును ఎమ్మెల్యే భవాని పరిశీలించారు.

డంపింగ్ యార్డు నుంచి తీవ్ర దుర్గంధం వస్తోందని, విష కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అంతేగాక కొవిడ్ వైద్య సేవల్లో ఉపయోగించిన పీపీఈ కిట్లు, వాడేసిన ఇతర వైద్య వ్యర్థాలు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ నగరపాలక సంస్థ అధికారులకు ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఐటీఐ తరలింపుపై వ్యతిరేకత

ABOUT THE AUTHOR

...view details