ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ తెలుగు మహాసభలకు మిజోరం గవర్నర్​ - World Telugu Mahasabhalu

World Telugu Mahasabhalu in Rajamahendravaram : జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, మాతృభాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో హరిబాబు పాల్గొన్నారు. కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు గజల్స్ వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని పరిస్థితులు చూస్తే తెలుగు బలహీన పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

telugu_mahasabhalu
telugu_mahasabhalu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 7:41 PM IST

World Telugu Mahasabhalu in Rajamahendravaram : జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. తెలుగుభాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయాలని పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత, చైతన్య విద్యాసంస్థల సంయుక్తల ఆధ్వర్యంలో రెండు రోజున నిర్వహించిన రెండవ అంతర్జాతీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హరిబాబు హాజరయ్యారు. రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలకు రాజమహేంద్రవరం గైట్​ ఇంజనీరింగ్​ కళాశాల వైదిక అయింది.


Telugu Mahasabhalu : రాజమహేంద్రవరంలోని గైట్​ ఇంజనీరింగ్​ కళాశాల ప్రాంగణంలో రాజరాజనరేంద్రుడి పేరుతో ప్రధాన వేదిక, ఆదికవి నన్నయ, కవి నారాయణభట్టు వేదికలను వివిధ సాహితీ కార్యకమాల నిర్వహణకు సిద్ధం చేశారు. రెండో జరిగిన తెలుగు మహాసభలకు మిజోరం గవర్నర్​ హరిబాబుతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆదికవి నన్నయ నడయాడిన నేల రాజమహేంద్రవరంలో శుక్రవారం నుంచి రెండో అంతర్జాతీయ మహాసభలను నిర్వహించారు. ' దేశ భాషలందు తెలుగు లెస్స ' అని శ్రీ కృష్ణదేవరాయలు కొనియాడారు. సుందరమైన భాష తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి వ్యాఖ్యానించారు. తెలుగు భాష గొప్పదనం... అరుకు, పాడేరు, ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో నుంచి గద్వాల్​ వరకు ఎన్నో యాసలు, ప్రాసలతో తులతూగుతుంది. ఇక అవధాన ప్రక్రియ, అలంకరణలు, చందస్సు అనేవి తెలుగు భాషకు ప్రత్యేకమంటూ ప్రముఖ కవులు కొనియడారు.
Kambampati Haribabu: 'గవర్నర్ అయినా విశాఖతో అనుబంధం కొనసాగుతుంది'

అంతర్జాతీయ తెలుగు మహాసభలకు మిజోరం గవర్నర్​

Telugu Language is The Best : తరతరాలకూ ఇవ్వాల్సిన భాషను ప్రజానాయకులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, పెద్దలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదని హరిబాబు పేర్కొన్నారు. 2500 ఏళ్ల చరిత్ర, సుమారు 1600 ఏళ్ల సాహితీచరిత్ర ఉన్న భాష తెలుగు అని పేర్కొన్నారు. కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని వెల్లడించారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పింగళి, ఆరుద్ర, త్రిపురనేని మహనీయుల కీర్తనలు, కవుల రచనలు తెలుగు భాషకు వన్నె తెచ్చాయన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నో నదులు తెలుగు నేలపైనే ప్రవహిస్తున్నాయని వివరించారు. కాటన్ మహాశయుని కారణంగా గోదావరి నది జలాలు సస్య శ్యామలం చేస్తున్నాయన్నారు.

Celebrities Who Attended The Telugu Mahasabhas : అంతర్జాతీయ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న డా. గజల్ శ్రీనివాస్, డా చైతన్య రాజు లను డా హరిబాబు అభినందించారు. ముఖ్యంగా వర్తమాన కాల సమస్యలను సున్నితమైన తెలుగు భాష ద్వారా గజల్స్ రూపంలో శ్రీనివాస్ సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆయన ప్రశంసించారు. మరోపక్క భాషోద్యమాన్ని కూడా తీసుకెళ్తున్నారని అన్నారు. ఈసందర్బంగా తెలుగు మహాసభలకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతా వసంత ట్రస్ట్ వ్యవస్థాపకులు డా కె ఐ వరప్రసాదరెడ్డి, ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ బి ప్రసాదరావు, జి హరికృష్ణ రాధికా దంపతులు తదితరులు పాల్గొన్నారు.

kambhampati: మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా: కంభంపాటి

ABOUT THE AUTHOR

...view details