తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో రూ.12.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ధర్మాన కృష్ణదాస్, తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించారు.
అన్నవరం దేవస్థానంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు - అన్నవరం దేవాస్థానం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులను పలువురు మంత్రులు, తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రులు అన్నారు.
అన్నవరం దేవస్థానంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు
మట్టే సత్య ప్రసాద్ సహకారంతో నిర్మించిన ప్రసాదం తయారీ భవనం, మట్టే శ్రీనివాస్ సహకారంతో నిర్మించిన ఉచిత కల్యాణ మండపం, స్వామి వారికి వార్షిక కల్యాణ వేదిక, లాకర్స్, గ్రానైట్ ఫ్లోరింగ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి, అన్యాక్రాంతం అయిన భూములను కాపాడటానికి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రులు అన్నారు.
ఇదీ చదవండి