తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఈనెల 25న ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు ధర్మాన కృష్ణదాసు, కురసాల కన్నబాబు, వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకుున్నారు.
అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ముప్పై లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనన్నట్లు మంత్రి కృష్ణదాస్ వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.