ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పవన్​ది లాంగ్​మార్చ్​ కాదు... రాంగ్​మార్చ్​'

జనసేన పార్టీ ఇసుక కొరతపై చేసేది లాంగ్​ మార్చ్​ కాదని రాంగ్​ మార్చ్​ అని మంత్రి అనిల్​కుమార్​ ఆరోపించారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి కన్నబాబు అన్నారు.

ఇసుక సమస్యపై మంత్రులు

By

Published : Nov 2, 2019, 4:47 PM IST

ఇసుక సమస్యపై మంత్రులు

ఇసుక కొరతపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. డిమాండ్‌, సరఫరా మధ్య తేడా రావడం వల్లే ఇబ్బందులొస్తున్నాయన్నారు. నదుల్లో వరద ఉంటే... ఇసుక ఎలా తీస్తారని మంత్రి ప్రశ్నించారు. వరద సమయంలో ఇసుక తీస్తే జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యులని నిలదీశారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని... 267 ర్యాంపుల్లో అనుమతి ఇచ్చినా వరద వల్ల తవ్వలేని పరిస్థితి ఉందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా తెదేపాతో పవన్ లాంగ్‌మార్చ్ చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు.

ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిల్ అన్నారు. వరద తగ్గగానే ఇసుక సరఫరా సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. పవన్​ లాంగ్‌మార్చ్ కాదు.. రాంగ్‌మార్చ్ చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details