జగన్ సత్యమైతే, చంద్రబాబు అసత్యమని... అదే వారిద్దరి పాలనలో ఉన్న తేడా అని మంత్రి వేణు అన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా, ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి జగన్... పాలన చేస్తున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారని కృష్ణదాస్ పేర్కొన్నారు.
రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ కమిటీ పనిచేయాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా సభ్యులు కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. రైతులకు వైకాపా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని... ఉచిత విద్యుత్, జలకళ, రైతుభరోసా వంటి పథకాల ద్వారా రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు.