తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆవిష్కరించారు.
అట్టడుగు స్థాయి నుంచి జగ్జీవన్ రామ్ ఉన్నత శిఖరాలకు ఎదిగారని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన నేతలు, వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దళితుల అభ్యున్నితి కోసం బాబు జగ్జీవన్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు.