తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ కొవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఒకరికి చికిత్స అనంతరం నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేసినట్లు కలెక్టర్ మురళీధర్ తెలిపారు. మిగిలిన పది కేసులకు సంబంధించి.. 72 ఏళ్ల వృద్ధుడికి విశాఖలో వైద్యం అందిస్తున్నామని.. మిగతా వాళ్ల ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి వివరించారు. సామాజిక మాధ్యమాల్లో లేనిపోని వదంతులు ప్రచారం చేస్తున్నారని కొత్తపేట శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
'రైతులను మోసగిస్తే చర్యలు తీసుకుంటాం' - కరోనా టాస్క్ ఫోర్స్‌పై మంత్రి పనిపే రివ్యూ న్యూస్
కరోనా వైరస్ కారణంగా దళారులు ఆక్వా ఉత్పత్తులను తక్కువ ధరలకు కొని రైతులను మోసగిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కేసులు పెట్టి.. జైలులో వేస్తామని హెచ్చరించారు.
minister vishwaroop review on taskforce