ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరిని మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తా - Ravulapalem

ప్రతిరోజు ఒక వసతిగృహాన్ని తనిఖీ చేసి... పరిస్థితులు తెలుసుకొని విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

మంత్రి పినిపే విశ్వరూప్

By

Published : Jun 16, 2019, 10:56 PM IST

మంత్రి పినిపే విశ్వరూప్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు వచ్చిన పినిపే విశ్వరూప్​కు తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఈ శాఖకు మంత్రిగా న్యాయం చేస్తామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశామన్న మంత్రి... రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి పాఠశాలలు నిర్మిస్తామన్నారు. తూర్పుగోదావరిని మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details